Header Banner

మీ ధైర్యం, పట్టుదల, కృషి ప్రతి ఆటలో విజయం తీసుకురావాలి! ఆల్ ద బెస్ట్, టీమిండియా!

  Fri Feb 21, 2025 11:19        Sports

సుమారు 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలుచుకునే లక్ష్యంతో టీమిండియా దుబాయ్ లోకి అడుగు పెట్టింది. అందుకు తగ్గట్టుగానే మొదటి మ్యాచ్ లో విజయం సాధించి మెగా టోర్నీలో శుభారంభం చేసింది. మరి టీమిండియా సెమీఫైనల్స్ సమీకరణాలేంటో తెలుసుకుందాం రండి.

12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియాకు మొదటి మ్యాచ్ లో శుభారంభం లభించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే మొదటి మ్యాచ్ చూశాక దుబాయ్‌లో విజయాలు సాధించడం టీమ్ ఇండియాకు అంత ఈజీ కాదనిపిస్తోంది. బంగ్లాదేశ్ టీమిండియా చాలా కష్టపడి నెగ్గింది. ఈ టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చినప్పటికీ, టీమ్ ఇండియా తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతోంది. గ్రూప్ దశలో తొలి మ్యాచ్ , గురువారం (ఫిబ్రవరి 20) బంగ్లాదేశ్‌తో జరిగింది.

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు! 

 

మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 228 పరుగులు చేసింది.ఆ తర్వాత మ్యాచ్‌లో టీం ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంలో మహమ్మద్ షమీ (5/53), శుభ్‌మాన్ గిల్ (101 నాటౌట్) కీలక పాత్రలు పోషించారు. ఈ విజయం టీమిండియా సెమీఫైనల్ అవకాశాలను సుగమం చసింది. గ్రూప్ దశలో టీం ఇండియా ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మరి టీం ఇండియా సెమీఫైనల్లోకి ఎలా ప్రవేశిస్తుంది? దాని వెనుక ఉన్న సమీకరణాలేంటో తెలుసుకుందాం రండి.

న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ విజయంతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. భారత జట్టు రెండో స్థానంలో ఉంది. రెండు జట్లకు చెరో రెండు పాయింట్లు ఉన్నాయి. కానీ రన్ రేట్ లో కివీస్ అగ్ర స్థానంలో ఉంది. సెమీఫైనల్ చేరాలంటే నెట్ రన్ రేట్ ముఖ్యం. న్యూజిలాండ్ 1.200తో మొదటి స్థానంలో ఉంది. భారతదేశం 0.408 తో రెండవ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ (-0.408) మూడో స్థానంలో, పాకిస్తాన్ (-1.200) నాలుగో స్థానంలో ఉన్నాయి.

సెమీఫైనల్ చేరాలంటే టీం ఇండియాకు ఒకే ఒక్క విజయం అవసరం. టీం ఇండియా తదుపరి మ్యాచ్ మార్చి 23న పాకిస్థాన్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో జరగనుంది. రెండు మ్యాచ్‌లు కఠినమైనవే. ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌ను ఓడించినట్లయితే టీం ఇండియా సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. కాబట్టి, ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం టీం ఇండియాకు చాలా ముఖ్యం. పాక్ పై విజయం సాధిస్తే భారత్ 4 పాయింట్లతో గ్రూపులో మొదటి స్థానంలోకి చేరుకుంటుంది. ఇదే జరిగితే టోర్నీలో పాకిస్తాన్ కథ ముగిసినట్లే. 23వ తేదీన జరిగే మ్యాచ్ లో టీం ఇండియా ఓడిపోతే, ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూజిలాండ్ ను ఓడించాల్సిందే.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #india #cricket #match #bangladesh #teamindia